13 November 2016
Hyderabad
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇంట ఇటీవలే శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. తలసాని ద్వితీయ పుత్రిక చి.ల.సౌ స్వాతికి చి.రవికుమార్ యాదవ్‌తో ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహమహోత్సవానికి పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఎటెండ్ అయ్యారు. అయితే మెజారిటీ పార్ట్ ఇండస్ట్రీ మిస్సయ్యింది కాబట్టి వారికోసం తలసాని ఓ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ - హెచ్ఐసీసీ- నోవాటెల్‌లో ఈ ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అతిధులందరినీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు పవన్‌కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, కృష్ణంరాజు, నందమూరి బాలకృష్ణ, డా.రాజేంద్రప్రసాద్, నాగేంద్రబాబు, నాటి మేటి కథానాయిక జమున, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సీనియర్ నటులు- నిర్మాత హరికృష్ణ, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శరత్ మరార్, రాధాకృష్ణ (చినబాబు), బి.గోపాల్, నిర్మాత ఎం.ఎస్.రాజు, దర్శకుడు కోడి రామకృష్ణ, కె.రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఎన్.వి.ప్రసాద్, కోదండ రామిరెడ్డి, గిరిబాబు, ఆర్.నారాయణమూర్తి, హీరోలు... గోపిచంద్, మంచు విష్ణు, మంచు మనోజ్, అక్కినేని అఖిల్, సునీల్, బ్రహ్మానందం, అలీ, సంపూర్ణేష్ బాబు, శివాజీరాజా, ఎన్.శంకర్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, చలపతిరావు, బి.ఎ.రాజు, ఉత్తేజ్, సురేష్ కొండేటి, రాజ్ కందుకూరి, కృష్ణభగవాన్, 30 ఈర్స్ పృథ్వీ, వేణుమాధవ్, హేమ, కృష్ణుడు, ప్రసన్నకుమార్, వీరభద్రమ్, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, రాజేశ్వరరెడ్డి, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ అన్ని శాఖల ప్రముఖులు ఈ విందు కార్యక్రమానికి విచ్చేశారు. సినిమా- టీవీ ఆర్టిస్టులు సహా గాయనీగాయకులు, రచయితలు వేడుకలో పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ కొనగళ్ల నారాయణ, సీఎం రమేష్ తదితరులు పాల్గొని నవవధూవరుల్ని ఆశీర్వదించారు.











