5 February 2017
Hyderabad
పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి చేతులమీదుగా "మాన్విస్ బ్యూటీ స్టూడియో & స్పా" ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ఎన్వీరాన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కె.వి.సుబ్రమణ్యం, మాన్విస్ బ్యూటీ స్టూడియో & స్పా నిర్వాహకులు శ్రీమతి కనకదుర్గ, శ్రీమతి చంద్రకళ, శ్రీమతి సత్యప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. "నవతరం యువతులు మరియు నిన్నటితరం మహిళలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఈ స్పాలో ఉండడం విశేషం. ఈ స్పాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
నిర్వాహకులు శ్రీమతి కనకదుర్గ-శ్రీమతి చంద్రకళ-శ్రీమతి సత్యప్రభావతిలు మాట్లాడుతూ.. "కేవలం డబ్బు సంపాదించడం అనేది ముఖ్య ఉద్దేశ్యం కాక.. సేవా ధృక్పధంతో ఈ బ్యూటీ మరియు స్పాను ప్రారంభించడం జరిగింది. అందుబాటు ధరల్లోనూ మెరుగైన, నాణ్యమైన సౌకర్యాలు సమకూర్చనున్నాం" అన్నారు.


