2 January 2017
Hyderabad
హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు నటిస్తోన్న నూతన సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలానే గతంలో వరప్రసాద్ ఐ ఫోన్ అనే వినూత్నమైన షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించి పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ స్ర్కీన్ ప్లే అండ్ డైరెక్షన్ కేటగిరిల్లో అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంతోనే నందు, సౌమ్యవేణుగోపాల్ హీరో హీరోయిన్లుగా ఇంతలో ఎన్నెని వింతలో అనే ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించారు. దాదాపు 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నూతన సంవత్సర కానుకగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు తాజాగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వరప్రసాద్ తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయని కొత్త కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కిందని త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ దర్శకుడు వరప్రసాద్ తెలుగు ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేశారు.

