pizza

Sridevi Movies, Indraganti's 'Sarangapani Jathakam' to release on 20 December
డిసెంబర్ 20న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' విడుదల

You are at idlebrain.com > news today >

12 October 2024
Hyderabad

'Sarangapani Jathakam' is directed by Mohanakrishna Indraganti and produced by Sivalenka Krishna Prasad under the banner of Sridevi Movies. It stars Priyadarshi in the titular role and Roopa Koduvayur as the female lead opposite him. This is a hat-trick film being made by Mohanakrishna Indraganti and Sivalenka Krishna Prasad, following their successful films, 'Gentleman' and 'Sammohanam'. The release date of this movie has been revealed today. Mark the date: It is December 20th, 2024.

Producer Sivalenka Krishna Prasad said, "We are going to release our film worldwide on December 20th. We completed the entire shooting by the first week of September. Currently, the dubbing works have also reached the final stage. The first copy will be ready very soon. We will also complete the censor formalities and bring the film to the audience during the Christmas holiday season."

He added, "Recently, I watched some rushes. I am very satisfied with the output. Is our future predetermined? Or, can we shape it with our will? 'Sarangapani Jathakam' is a perfect comedy film that answers this question thoughtfully. We are happy to see Mohanakrishna in Indraganti's heart-to-heart entertaining series. 'Sarangapani Jathakam' will be a memorable movie for our banner."

Cast:
Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani, 'IMAX' Venkat.

Crew:
Make-Up Chief: RK Vyamajala.
Costume Chief: N Manoj Kumar.
Costume Designers: Rajesh Kamarsu, Ashwin.
Production Executives: K Ramanjaneyulu (Anji Babu), P Rasheed Ahmed Khan.
PRO: Pulagam Chinnarayana
Marketing: Talk Scoop
Co-Director: Kota Suresh Kumar.
Lyricist: Ramajogayya Sastry
Stunts: Venkat - Venkatesh
Production Designer: Raveender
Editor: Marthand K Venkatesh
Director of Photography: PG Vinda
Music Director: Vivek Sagar
Line Producer: Vidya Sivalenka
Producer: Sivalenka Krishna Prasad
Writer, Director: Mohanakrishna Indraganti

డిసెంబర్ 20న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' విడుదల

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని నేడు వెల్లడించారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ''డిసెంబర్ 20న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. ఇటీవల కొన్ని సన్నివేశాలు, ఫుల్ రష్ చూశా. నాకు ఎంతో సంతృప్తి కలిగింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం మా 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంటిల్లిపాది నవ్వుకునే వినోదాత్మక తీస్తుండటం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో 'సారంగపాణి జాతకం' గుర్తుండిపోయే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved