pizza

Ajay’s powerful look from Pottel
'పొట్టేల్' నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

14 October 2024
Hyderabad

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చేయని క్యారెక్టర్ చేస్తున్నారు.

ఇందులో అజయ్ పటేల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ అజయ్ ని పటేల్ గా పరిచయం చేస్తూ పవర్ ఫుల్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇంటెన్స్, రస్టిక్ గా కనిపించిన అజయ్ లుక్ ఫెరోషియస్ గా వుంది. డెంజరస్ గా కనిపిస్తున్న రెండు డాగ్స్ ని చైన్స్ తో పట్టుకొని రగ్గడ్ గా కనిపిస్తున్న అజయ్ లుక్ అందరినీ దృష్టిని ఆకర్షించింది.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. టీజర్‌ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.

'పొట్టేల్' అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు - నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం- శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్
లిరిక్స్ - కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్
ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved