pizza

Megastar Chiranjeevi Clapped For Grand Muhurtham Of Virat Karrna, Abhishek Nama, Kishore Annapureddy, NIK Studios, Abhishek Pictures, Tarak Cinemas’ Pan India Film NAGABANDHAM, Regular Shoot From October 23rd
మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్ అయిన విరాట్ కర్ణ, అభిషేక్ నామా, కిషోర్ అన్నపురెడ్డి, NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్, తారక్ సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ 'నాగబంధం'-అక్టోబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్‌

You are at idlebrain.com > news today >

14 October 2024
Hyderabad

 

Abhishek Nama is one of the most passionate filmmakers who has a good taste in making movies. He has been making large scale movies at Pan India level. After making successful debut as a director with Devil: The British Secret Agent, he announced his next directorial venture NAGABANDHAM with the tagline- The Secret Treasure. Abhishek Nama also penned the story and screenplay. Kishore Annapureddy will produce this majestic adventure as Production No. 1 of NIK Studios, in association with Abhishek Pictures. Co-produced by Tarak Cinemas, Lakshmi Ira and Devansh Nama present the movie.

Virat Karrna who made an impressive debut with the actioner Peddha Kapu won accolades for his power-packed performance. He will be playing the lead role in the movie Nagabandham that also stars Nabha Natesh and Iswarya Menon playing the female leads, and Jagapathi Babu, Jayaprakash, Murali Sharma and B.S. Avinash in important roles.

This highly anticipated film was launched splendidly today in the presence of the film’s team and a few special guests. Megastar Chiranjeevi who graced the occasion as a chief guest has sounded the clapboard for the muhurtham shot. While the camera as switched on by Talasani Srinivas Yadav, the first shot was directed by Ajay Bhupathi. Asian Suniel handed over the script to the makers.

Abhishek Nama penned a powerful script laced with spiritual and adventurous elements. After the opening of the treasure at the Padmanabhaswamy Temple in Thiruvananthapuram and the Ratna Bhandar at the Puri Jagannath Temple, the topic of hidden treasures has become a hot topic in the country. The 108 Vishnu temples in India are being protected through Nagabandham. The film's story revolves around the Nagabandham associated with the 108 Vishnu temples in India.

The enchanting introductory video captivated the audience, transporting them to a mesmerizing and mysterious world. Avinash, known for his role in KGF, appeared as an Aghora. With its expansive scope, this film promises high production values and top-notch technical standards, including exceptional VFX.

Soundar Rajan S is the lensman for the movie, while Abhe is the music director. Kalyan Chakravarthy penned the dialogues, while Santosh Kamireddy is the editor. Ashok Kumar is the production designer.

This ambitious high-budget project promises an immersive journey into a realm of magic, mystery, and adventure. NAGABANDHAM is a Pan India film set for a simultaneous release in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam in 2025.

The makers have announced that regular shooting will commence on the 23rd of this month.

Cast: Virat Karrna, Nabha Natesh, Iswarya Menon, Jagapathi Babu, Jayaprakash, Murali Sharma, B.S. Avinash, and others

Technical Crew:
Banners: NIK Studios & Abhishek Pictures
Lakshmi Ira & Devansh Nama Present
Story, Screenplay, & Director: Abhishek Nama
Producer: Kishore Annapureddy
Co-Producer: Tarak Cinemas
Director of Photography: Soundar Rajan S
Music: Abhe
Co-Producer: Tarak Cinemas
CEO: Vasu Potini
Production Designer: Ashok Kumar
Dialogues: Kalyan Chakravarthy
Editor: Santosh Kamireddy
Executive Producer: Abhinethry Jakkal
Action: Venkat
Dolby Atmos mixing: E.Radhakrishna d.f. tech
Special Effects: J.R. Ethiraj
Script Development: Rajiv n Krishna
VFX: Thunder Studios
Publicity Designs: Kaani Studios

మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్ అయిన విరాట్ కర్ణ, అభిషేక్ నామా, కిషోర్ అన్నపురెడ్డి, NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్, తారక్ సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ 'నాగబంధం'-అక్టోబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్‌

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ 'నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్' ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని నిర్మించనున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.

'పెదకాపు' సినిమాతో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన విరాట్ కర్ణ, తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 'నాగబంధం' చిత్రంలో విరాట్ కర్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆసియన్‌ సునీల్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.

అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది.

మెస్మరైజ్ చేసే ఇంట్రో వీడియో ప్రేక్షకులను కట్టిపడేసింది. KGFలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న అవినాష్ అఘోరాగా కనిపించారు. ఈ చిత్రంలో VFX, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా వుండబోతున్నాయి.

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.

ఈ ప్రతిష్టాత్మకమైన హై-బడ్జెట్ ప్రాజెక్ట్ మేజిక్, మిస్టరీ, అడ్వెంచర్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీ నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేశారు.

లాంచింగ్ ఈవెంట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. చిరంజీవి గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలౌతున్నాను. సినిమా చాలా మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ' అన్నారు

నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మరో ఏడాదిన్నరలోనే సినిమాని ప్రేక్షకులను తీసుకొస్తున్నాము. ఎగ్జాక్ట్ డేట్ త్వరలోనే చెప్తాము. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అందరికీ థాంక్యూ' అన్నారు

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాగబంధం ఇంట్రో వీడియో రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది. అభిషేక్ నామా గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా రూపొందిస్తున్నారు. కిషోర్ గారు చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విరాట్ తో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిషేక్ గారికి థాంక్యూ. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం' అన్నారు.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
ప్రెజెంట్స్: లక్ష్మీ ఐరా & దేవాన్ష్ నామా
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ అన్నపురెడ్డి
సహ నిర్మాత: తారక్ సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: సంతోష్ కామిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినేత్రి జక్కల్
యాక్షన్: వెంకట్
డాల్బీ అట్మాస్ మిక్సింగ్: ఇ.రాధాకృష్ణ డి.ఎఫ్. సాంకేతికత
స్పెషల్ ఎఫెక్ట్స్: J.R. ఇతిరాజ్
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
VFX: థండర్ స్టూడియోస్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోస్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved