pizza

Power Star Pawan Kalyan, Mega Surya Productions's Massive Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit Song release date locked
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' మొదటి గీతం విడుదల తేదీ ఖరారు

You are at idlebrain.com > news today >

13 October 2024
Hyderabad

Power Star Pawan Kalyan, one of the craziest stars of Indian Cinema, is starring in a period action epic for the first time in his career. His upcoming film, Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, is being made on a large scale by the producers, aiming to give a unique and memorable theatrical experience to the audiences.

Recently, the team restarted the film shoot after a gap, due to the lead actor's political commitments. The team shot a gigantic action sequence, under the guidance of Hollywood legend Nick Powell. The action director has been specially recruited for this imaginative sequence involving 400 - 500 artistes along with Pawan Kalyan.

Now, the makers have announced a very special news on the auspicious occasion of Duesshra. The first single from the movie will be releasing soon. This news is special for all the fans of the actor and Telugu audiences as in Telugu, the song is sung by none other than Pawan Kalyan. While other singers crooned it other languages.

The ferocious poster released by the makers celebrating the occasion of Dasara, involved Pawan Kalyan aiming three arrows at his opponents almost like wielding Goddess Shakti's Trishul. In a way, fans are happy that the actor is aiming at a triple blockbuster at the box office with this film.

The makers have also stated that the filming will start again from 14th October and the complete film will be wrapped up 10th November. The action epic celebrates the unrelenting fight of a legendary outlaw warrior's quest for freedom against imperialists, oppressors.

"Animal" fame Bollywod actor Bobby Deol is playing a prominent role in the film while Niddhi Agerwal is playing the leading lady role. Legendary actor Anupam Kher, Sachin khedkhar, Kota sreenivasarao, Tanikella Bharani, Sunil, Kabir Duhan Singh, Nasser, Raghu Babu, muralee sarma, Ayyappa Sharma, neehaar Kapoor, subbaraya sarma, narra sreenu, Subbaraju, Dalip Tahil, Anasuya Bhardwaj, Poojita ponnada

and many others are cast in important roles in the film.

Young director Jyothi Krisna is directing this massive scale action epic keeping Pawan Kalyan fans expectations in mind. He has been instrumental in creating good hype and buzz around the film with timely updates and goosebumps inducing teaser.

Ace Cinematographer Manoj Paramahamsa is handling cinematography with legendary production designer Thotha Tharani taking care of art department. Baahubali fame VFX supervisor Srinivas Mohan is also part of the prestigious crew.

Above all, Oscar award winning composer MM Keeravani is composing music for the film. A. Dayakar Rao is producing the film on Mega Surya Productions banner with legendary producer AM Rathnam presenting it.

Pawan Kalyan's epic outlaw warrior action drama Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit is set to release on 28th March 2025, in Telugu, Tamil, Malayalam, Hindi and Kannada languages worldwide.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' మొదటి గీతం విడుదల తేదీ ఖరారు

- త్వరలోనే 'హరి హర వీర మల్లు పార్ట్-1' మొదటి గీతం

- పాటను స్వయంగా ఆలపించిన పవన్ కళ్యాణ్

- అక్టోబరు 14 నుంచి కొత్త షెడ్యూల్

- నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చిత్రీకరణకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇటీవలే తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర బృందం చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశానికి యాక్షన్ దర్శకుడుని ప్రత్యేకంగా నియమించారు.

ఇప్పుడు, దసరా శుభ సందర్భంగా నిర్మాతలు చాలా ప్రత్యేకమైన వార్తను ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి గీతం విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులు ఆనందపడే మరో విషయం ఏంటంటే తెలుగులో ఈ పాటను స్వయంగా పవన్ పాడారు. ఈ గీతాన్ని ఇతర భాషలలో ఇతర గాయకులు పాడారు.

దసరా సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాతలు విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను గురిపెట్టారు. ఈ పోస్టర్ చూశాక, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో తమ అభిమాన నటుడు ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అక్టోబరు 14 నుంచి మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, నవంబర్ 10 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి అవుతుందని నిర్మాతలు తెలిపారు. సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా అని నిర్మాతలు వెల్లడించారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్, నీహార్ కపూర్, సుబ్బరాయ శర్మ, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, దలీప్ తాహిల్, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన టీజర్ తో పాటు, పవన్ అభిమానులు అనందించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటంలో జ్యోతి కృష్ణ కీలక పాత్ర పోషించారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved