pizza

Ram Charan's 'Ra Macha Macha' song promo in "Game Changer" starts spirit of celebration
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి ‘ రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమో రిలీజ్... సెప్టెంబర్ 30న పాట విడుదల

You are at idlebrain.com > news today >

27 September 2024
Hyderabad

Global superstar Ram Charan's highly anticipated political drama, Game Changer, directed by acclaimed filmmaker Shankar Shanmugam, is creating a stir. The film's makers have recently launched its promotional campaign, much to the excitement of fans and movie enthusiasts.

Today, the makers unveiled the promo for the second single, titled "Ra Macha Macha" (Telugu and Tamil) and "Dam Tu Dikhaja" (Hindi). The song's Tamil version lyrics are penned by Vivek and the Hindi version lyrics are penned by Kumaar. Nakash Aziz sang the song in all the three languages.

Renowned lyricist Ananth Sriram penned the Telugu version song, while the talented Thaman composed the melody. The energetic Nakash Aziz lent his powerful vocals to the track, elevating its tempo and creating a dynamic listening experience.

The song promo showcased Ram Charan's electrifying dance moves, leaving fans eager to hear the full version. His energy and charisma were on full display, captivating viewers and setting the stage for a visually stunning musical treat. Ram Charan stunned all with his unique dance moves and the energetic voice of Nakash Aziz and thumping drum beats of Thaman drives listeners crazy. The song has been shot in a lavish manner in the backdrop of extravagantly erected sets.

The complete song will be available on September 30. Recognizing Ram Charan's exceptional dance skills, renowned choreographer Ganesh Acharya incorporated a diverse array of dance styles from across India, including classical, folk, and contemporary forms. To create a truly immersive experience, Acharya brought together over 1,000 folk dancers from different regions, showcasing the rich cultural tapestry of India. The song serves as a vibrant tribute to the nation's diverse dance traditions.

Set for release in Telugu, Tamil, and Hindi, Game Changer is poised to become a nationwide sensation, captivating Ram Charan's massive fan base across India. With its powerful narrative, stellar performances, and visually stunning sequences, the film is expected to leave a lasting impression on audiences.

The film promises to be a thrilling mass entertainer, featuring Ram Charan in dual roles, delivering a dynamic and captivating performance. Joining him are the talented Kiara Advani and Anjali, who bring their own unique charm and depth to their characters. The stellar cast also includes Samuthirakani, SJ Suryah Srikanth, Sunil, and Naveen Chandra, each contributing their expertise to create a memorable ensemble. Produced by Dil Raju under Sri Venkateswara Creations, Game Changer is being meticulously crafted as a prestigious project, with high production values and a commitment to excellence.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి ‘ రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమో రిలీజ్... సెప్టెంబర్ 30న పాట విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుద‌ల చేశారు. తెలుగు, తమిళంలో పాటు ‘ రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ ధమ్ తు దికాజా..’ అంటూ అలరించనుంది.

రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా తెర‌కెక్కిన ఈ పాట సెప్టెంబర్ 30న పాట రిలీజ్ అవుతుంది. కాగా శ‌నివారం ప్రోమో విడుద‌లైంది. రా మ‌చ్చా మ‌చ్చా రా.. అంటూ సాగుతున్న ఈ పాటను ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న మార్క్‌ను చూపిస్తూ తెర‌కెక్కించారని ప్రోమో చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఎన‌ర్జిటిక్‌, స్టైలిష్ లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక గ్రేస్‌తో ఆయ‌న వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఈ స్టెప్ నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇందులో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు.. ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషం.


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని పాట‌ను శంక‌ర్ వినూత్నంగా తెర‌కెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి. ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేశారు. గ్రాండియ‌ర్ లుక్‌, డిఫ‌రెంట్ సౌండింగ్‌తో పాట ప‌ల్ల‌వి వింటుంటేనే డాన్స్ వేయాల‌నేంత ఎనర్జిటిక్‌గా ఉంది. గ‌ణేష్ ఆచార్య మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీలో న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు. ప్రోమోతో ఇక పూర్తి పాట వినాల‌నే ఆతృత అంద‌రిలోనూ మ‌రింత‌గా పెరిగింది. సెప్టెంబ‌ర్ 30న పూర్తి పాట విడుద‌ల కానుంది.

రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ గేమ్ ఛేంజ‌ర్ రెడీ అంటోంది.

లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తుండ‌గా తిరుణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved