pizza

Vijay Antony's Next titled "Gagana Maargan", a Murder Mystery-Crime Thriller, Gears Up for Release
మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన విజయ్ ఆంటోని ‘గగన మార్గన్’ ఫస్ట్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >

16 October 2024
Hyderabad

Vijay Antony who is known for his versatility as an actor is coming up with another intriguing project billed to be a gripping murder mystery-crime thriller that delves into the world of detective fiction. Vijay Antony Films Corporation is producing, while Meera Vijay Antony proudly presents its 12th production directed by Leo John Paul. The film's title is revealed as "Gagana Maargan", translates to "one who travels through air" in the Siddhar dictionary, hinting at the film's unique narrative.

The first look poster is nothing shot of captivating, as it presents the injured Vijay Antony with a serious expression, whereas the second image shows the under-water sequence.

Leo John Paul, known for editing films like "Attakathi", "Beeda", "Soodhu Kavvum", "Indru Netru Naalai", "Thekadi", "Mundasupatti", "Kadalum Kadandhu Pogum", "A1", and "Mayavan", makes his directorial debut with "Gagana Maargan". He won the Tamil Nadu State Film Award for Best Editor for "Idharkuthane Aasaipattai Balakumara" in 2013.

The film boasts an impressive cast, including Samuthirakani, Mahanadhi Shankar, Prithika, Brigida, Vinodh Sagar, Ajay Dhishan, Deepshikha, Kalakka Povadhu Yaaru Archana, Kanimozhi, and Anthagaram Natarajan.

The technical crew includes Yuva S as cinematographer, Raja A as art director, and Vijay Antony as music composer. Notably, the film features underwater sequences shot in Mumbai and impressive visual effects.

"Gagana Maargan" is a family-friendly film suitable for all ages and is gearing up for a theatrical release soon.

Cast: Vijay Antony, Samuthirakani, Mahanadhi Shankar, Prithika, Brigida, Vinodh Sagar, Ajay Dhishan, Deepshikha, Kalakka Povadhu Yaaru Archana, Kanimozhi, and Anthagaram Natarajan

Technical Crew:
Writer, Director: Leo John Paul
Producer: Vijay Antony Films Corporation
Presents: Meera Vijay Antony
Music: Vijay Antony
Cinematography: Yuva S
Art Director: Raja A

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన విజయ్ ఆంటోని ‘గగన మార్గన్’ ఫస్ట్ లుక్ విడుదల

నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది.

"అట్టకత్తి", "బీడ", "సూదు కవ్వుం", "ఇంద్రు నేత్ర నాళై", "తేకడి", "ముండాసుపట్టి", "కదలుం కాదందు పోగుం", "ఏ1", "మాయవన్" వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. లియో జాన్ పాల్ 2013లో "ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార" చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.

ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారు నటించారు.

యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్‌గా పని చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ముంబైలో చిత్రీకరించిన నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

‘గగన మార్గన్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: విజయ్ ఆంటోని, సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు : లియో జాన్ పాల్
నిర్మాత : విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved