pizza

Die-Hard Fan Travels 1600km to Meet Icon Star Allu Arjun
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

You are at idlebrain.com > news today >

16 October 2024
Hyderabad

Icon Star Allu Arjun enjoys the support of a massive fan base. He always values the love they shower on him in different ways, and he sees it as precious.

A die-hard fan of the super-talented pan-Indian hero has travelled over 1,600 kilometers from Aligarh in Uttar Pradesh to meet his favourite actor in Hyderabad. Allu Arjun had the fan at his place and had a brief chit-chat.

In a video that has gone viral, we can see Bunny expressing his surprise. The fanboy has described Bunny as his real hero who is both down-to-earth and sweet-natured. For the young fan, getting to see the Icon Star from close quarters is an experience beyond words. For him, watching him on screen was one thing, but experiencing his presence up close was truly overwhelming. It was a dream that became a reality and a moment he will cherish forever. The fan can be heard saying that he had read the Hanuman Chalisa multiple times before embarking on the cycling journey.

The Icon Star's 'Pushpa 2: The Rule' is hugely awaited.


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇలా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు. అందుకు అల్లు అర్జున్‌ అభిమానులతో ఎంతో ప్రేమగా వుండటమే కారణం. ఇక పుష్ప-2 చిత్రంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారారు. పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ ఆయన మేనరిజం స్వాగ్‌కు అందరూ పడిపోయారు. ఇలా అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడే ఓ ఉత్తరప్రదేశ్‌ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై 1600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్‌ చాట్‌ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో అల్లు అర్జున్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూడొచ్చు. తమ అభిమాన హీరోని కలిసిన ఆ అభిమాని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది. అల్లు అర్జున్‌ తన నిజమైన హీరోగా అభివర్ణించడం, అల్లు అర్జున్‌ను కలవడం తన జీవితంలో మరుపురాని అనుభూతిగా ఆ అభిమాని వర్ణించాడు. అంతేకాదు సైక్లింగ్ మొదలుపెట్టే ముందు చాలా సార్లు హనుమాన్‌ చాలిసా చదివానని ఈ సందర్భంగా ఆ అభిమాని తెలిపాడు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved