
29 May 2015
Hyderabad
‘లవ్ టచ్’ హీరో, హీరోయిన్ల పెళ్ళిసందడి
రీసెంట్గా ‘లవ్‌టచ్’ చిత్రంలో హీరోగా నటించిన జయంత్‌రెడ్డి, పంజాబ్ బెస్ట్ యాక్ట్రస్ 2014గా ఎంపికైన ద్రితి సహరన్ నిజ జీవితంలో ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరు ‘లవ్ టచ్’ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. టిఆర్ఎస్ స్టేట్ లీడర్ పట్లోళ్ళ జైపాల్ రెడ్డి తనయుడైన జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ల వివాహం గురువారం శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రౌండ్ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిన నర్సింహారెడ్డి, హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలతో పాటు డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, బాబుమోహన్ పలువురు ఎమ్ఎల్ఎ, ఎమ్‌ఎల్‌సిలు హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పంజాబీ యువతీ యువకులు చేసిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
