
22 February 2016
Hyderabad
విడుదలకు సిద్ధమవుతున్న 'తుహిరే మేరీ జాన్'
దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై వికాస్, కళ్యాణి జంటగా ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో నాగేశ్వరావు నిర్మిస్తోన్న చిత్రం 'తుహిరే మేరీ జాన్'. ఈ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ‘’సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Nikhita Glam gallery from the event |
|
|
|
హీరో వికాష్ మాట్లాడుతూ ‘'తెలుగులో ఇది నా మొదటి సినిమా. అందరూ కొత్తవాళ్ళతో కలిసి చేశాం. మంచి పాటలు కుదిరాయి. సినిమాను కొత్తగా తీయడానికి ప్రయత్నించాం. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేసే మూవీ అవుతుందని చెప్పగలను’' అన్నారు.
కళ్యాణి మాట్లాడుతూ ‘’నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాను. ప్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జోడా శాండీ, కోరియోగ్రఫీ: కెవిన్, బాబి ఏంటోనీ, ఎడిటింగ్: రాజు లీల, పాటలు: చాణక్య, నిర్మాత: నాగేశ్వరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్ కుమార్.