10 October 2024
Hyderabad
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రిమియర్స్ కి యూనానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. దాదాపు పది థియేటర్స్ లో మా నాన్న సూపర్ హీరో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. అక్కడ్నుంచి యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది. మేము ఎక్కడైతే పబ్లిక్ కనెక్ట్ అవుతారని అనుకున్నాము సరిగ్గా మేము ఊహించినట్లే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వైజాగ్ లో ఒక మాస్ థియేటర్లో ఆడియన్స్ తో కూర్చొని సినిమా చూశాను. కొన్ని సీన్స్ కి క్లాప్స్ కొడుతున్నప్పుడు ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో అర్థమౌతుంది. సినిమా చివరిలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆ సైలెన్స్ ని కూడా ఎంజాయ్ చేశాం. ఇప్పటివరకు నేను చేసింది దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నాను. ఆడియన్స్ సినిమా చూశాక నాన్న గుర్తొస్తున్నారు, మాటలు రావడంలేదని చెప్తున్నారు. ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ అభిలాష్ వండర్ బాయ్. చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాని తను తప్పితే మరో దర్శకుడు ఇంత చక్కగా తీయగలడని నేను అనుకోవట్లేదు. జై ఫెంటాస్టిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సమీర్ వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చాడు. శశాంక్ వండర్ఫుల్ యాక్టర్. తనతో యాక్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆర్ణ టెర్రిఫిక్ గా యాక్ట్ చేసింది. తను ఫ్యూచర్లో ఇంకెన్నో మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సునీల్ నేను మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరం కలిసి ఇలాంటి ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. రేపు అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ దసరాకి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడండి. డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు
నిర్మాత సునీల్ మాట్లాడుతూ.. థాంక్యూ ఎవ్రీ వన్. ప్రీమియర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అభిలాష్ అండ్ టీం వర్క్ వెరీ హార్డ్. సుధీర్ బాబు గారు సినిమాలో చాలా బాగా చేశారు. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. థాంక్యూ సో మచ్' అన్నారు
డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యు. మీడియా మొదటి నుంచి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసింది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ సో మచ్. ప్రీమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫిమేల్ ఆడియన్స్ సన్ ఫాదర్ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారా లేదా అనుకున్నాను కానీ వాళ్లు కూడా చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు . నిజంగా నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రసాద్ గారికి, మైత్రి శశి అన్నకి థాంక్యూ. ఈ సినిమా కోసం ఏదైతే అనుకున్నాము అది 100% స్క్రీన్ కి ట్రాన్స్ లేట్ అయింది. ఆడియన్స్ కి 100% వెళ్ళింది. ప్రొడ్యూసర్ సునీల్ అన్న, వంశీ అన్నకి బిగ్ థాంక్స్. మా టీమ్ అంతా ఇది 100% హీట్ అవుతుందని నమ్మం. అదే రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది' అన్నారు.
యాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మామూలుగా ఏ సినిమాకైనా రిలీజ్ అయినప్పుడు ఎక్సైట్ మెంట్, టెన్షన్ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాకి ఎక్సైట్ మెంట్, కాన్ఫిడెన్సి ఉంది. టెన్షన్ లేదు. ఎందుకంటే ప్రీమియర్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అభిలాష్ ఇందులో మంచి స్పెషల్ రోల్ ఇచ్చాడు. క్యామ్ ఎంటర్టైన్మెంట్లో ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ సినిమాలు వస్తాయి. మా నాన్న సూపర్ హీరో టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్యు. మా నాన్న సూపర్ హీరో సెట్ నాకు చాలా స్పెషల్. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. చాలా బ్యూటిఫుల్ సినిమా చేసాం. రేపు మీ అందరి ముందుకు వస్తుంది. ఒక మంచి రిజల్ట్ తో మా అందరిని హ్యాపీ చేస్తారని కోరుకుంటున్నాం. సుధీర్ బాబు మీ అందరిని సర్ప్రైజ్ చేస్తారు. ఆయన కెరీర్ లోనే ఇది వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలసి చూడండి'అన్నారు.
హీరోయిన్ అర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గర అయింది. ఈ సినిమాలో చాలా మీనింగ్ ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రోల్ దొరకడం ఒక న్యూ కమ్మర్ గా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ అభిలాష్ కి థాంక్యూ. సుదీర్ బాబు గారికి, సునీల్ గారికి, అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిన్న జరిగిన ప్రీమియర్స్ కి చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిందాని కంటే బెటర్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అభిలాష్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి అది అర్థమవుతుంది. ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. ప్రతి క్రాఫ్ట్ చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయిన సినిమా ఇది. ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. సుధీర్ బాబు గారి కెరియర్ లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ప్రొడక్షన్ వాల్యూస్ లో రిచ్ నెస్, క్వాలిటీ అన్ని అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అందరికీ థాంక్యూ' అన్నారు
డిఓపి సమీర్ మాట్లాడుతూ.. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిలిం మా నాన్న సూపర్ హీరో. ఒక ఇంటెన్స్ ఎమోషన్ ని 2 అవర్స్ సస్టెన్ చేయడం నాట్ ఏ ఈజీ టాస్క్. డైరెక్టర్ అభిలాష్ చాలా అద్భుతంగా ఈ సినిమాని హ్యాండిల్ చేశారు. తప్పకుండా సినిమా చూసిన ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్మకం ఉంది. సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి' అన్నారు.