
18 March 2016
Hyderabad
లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సాక్షి చౌదరి, పర్ వీణ్ రాజు, పోసాని ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. శేషసాయి దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణ రెడ్డి క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే కోన రాఘవులు కెమెరా స్విచ్చాన్ చేశారు, వి.సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దర్శకుడు శేషసాయి మాట్లాడుతూ ‘’పది సంవత్సరాలుగా రైటర్ గా వర్క్ చేశాను. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. నిర్మాత నా బ్రదర్ కావడంతో నా కథ విన్నారు. ఆయనకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశారు. యూత్ మైండ్ సెట్ గురించి చెప్పే సబ్జెక్ట్. పోసాని డిఫరెంట్ క్యారెక్టర్ లోకనపడతారు. సినిమాను మంచి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తాం. ముందు సాంగ్స్ పూర్తి చేసుకుని తర్వాత టాకీ షూట్ చేస్తాం’’ అన్నారు.
సాక్షి చౌదరి మాట్లాడుతూ ‘’డైరెక్టర్ గారు చెప్పిన పాయింట్ నచ్చింది. యూత్ కు మెసేజ్ ఇచ్చే చిత్రంలో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. దర్శక నిర్మాతలకు థాంక్స్జ్’’ అన్నారు.
హీరో పర్ వీణ్ రాజు మాట్లాడుతూ ‘’ప్లేయర్ మూవీ తర్వాత నేను చేస్తున్న మూవీ. మంచి కామెడి ఎంటర్ టైనర్ మూవీ. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.
పూజిత మాట్లాడుతూ ‘’అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణరెడ్డి మాట్లాడుతూ ‘’డైరెక్టర్ నా బ్రదర్ అని సినిమా చేయలేదు. కథ నచ్చడంతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాను. పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణకు వెళుతున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఝాన్సీ, సప్తగిరి, షకలక శంకర్, అప్పారావు, తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: శ్రీ గణేష్, శేష సాయి, కెమెరా: శంకర్ కంతేటి, మ్యూజిక్: కృష్ణ, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయి కృష్ణ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేష సాయి.




Glam galleries from the event |
|
|