
02 June 2015
Hyderabad
ఆర్.కె. ఫిల్మ్ ఫ్యాక్టరీస్ పతాకంపై మనోజ్‌నందం, నీలోఫర్ హీరో, హీరోయిన్లుగా దర్శకనిర్మాత ఎమ్. రాజ్‌కుమార్ రూపొందించనున్న చిత్రం ‘అదరగొట్టు’. ఈ చిత్రం ఇటీవలే హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఫైనాన్షియర్ ఎమ్.ఆర్. చౌదరి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రపు తొలి సన్నివేశానికి రియల్టర్ కె.బి. ప్రసాద్ క్లాప్ నివ్వగా, ఎస్.బి.హెచ్ మేనేజర్ వి.ఎస్. నాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
అనంతరం దర్శకనిర్మాత ఎమ్. రాజ్‌కుమార్ మాట్లాడుతూ..‘ మంచి కథ కుదిరింది. మా టీమ్‌తో నిజంగానే అదరగొట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాము. జూన్ 15 నుండి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని సాంగ్స్‌ని అమెరికాలో చిత్రీకరణ జరుపనున్నాము..’ అని తెలిపారు.
మనోజ్‌నందం, నీలోఫర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ధరణికోట, సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటర్: రమేష్, ఆర్ట్: కృష్ణ, కెమెరా: విజయ్‌కుమార్, సమర్పణ: వర్ధినేని రవీందర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాసు, సహనిర్మాత: జె.వి. నాయుడు, నిర్మాత`దర్శకుడు: ఎమ్. రాజ్‌కుమార్.

