|

18 April 2015
Hyderabad
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవిని గెల్చుకున్నారు. తన ప్యానెల్ లో నిలబడి, విజేతలైన శివాజీరాజా, కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరామ్ తదితరులతో పాటు నటుడు ఉత్తేజ్ తో సహా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు రాజేంద్రప్రసాద్. శనివారం సాయంత్రం 5 గంటలకు చిరంజీవి స్వగహానికి వెళ్లారు. 'మా' నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఆయన సహచరులను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు అందజేశారు. అలాగే, విజేతలకు పుష్పగుచ్ఛాలిచ్చి, శాలువాతో సత్కరించారు.

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|