
08 June 2015
Hyderabad
ఘనంగా జరిగిన జి.ఆదిశేషగిరిరావు తనయుడు ఘట్టమనేని సాయి రాఘవ రత్నబాబు(బాబీ) నిశ్చితార్థ వేడుక
సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, పద్మాలయా స్టూడియోస్ అధినేత జి.ఆదిశేషగిరిరావు, శ్రీమతి లలితా ప్రమీల దంపతుల కుమారుడు చి॥ ఘట్టమనేని సాయి రాఘవ రత్నబాబు(బాబీ) వివాహం శ్రీ దిలీప్‌కుమార్, శ్రీమతి సుచరిత దంపతుల కుమార్తె చి॥ల॥సౌ॥ ప్రియాంక దడ్డల వివాహం డిసెంబర్ 23, 2015న జరగనుంది. కాగా, ఘట్టమనేని సాయిరాఘవ రత్నబాబు(బాబీ), ప్రియాంక దడ్డల నిశ్చితార్థం హైటెక్స్‌లో జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, నందమూరి హరికృష్ణ, నారా రోహిత్‌లతోపాటు మరెంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులకు అశీస్సులు అందజేశారు.


