
6 September 2015
Hyderabad
నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను ప్రారంభించిన నారారోహిత్
హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ననందమూరి, నారా అభిమానుల సమక్షంలో నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. హీరో నారా రోహిత్ ఈ వేడుకలను కేక్ కటింగ్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ నందమూరి మోక్షజ్ఞకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నందమూరి, అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తాడికొండ సాయిక్రిష్ణ, శివ త్రిపురనేని, శివ గుంటూరు, లంకమల్లి, ఎ.రవినాయుడు, వంశీ నార్ని, నాగేశ్వరరావు, నారా ప్రశాంత్, దుర్గ, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.
