
31 May 2014
Hyderabad
ఊటీలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుస్తక ఆవిష్కరణ
సూపర్ స్టార్ కృష్ణ 72వ జన్మదిన వేడుకలు శనివారం ఉదయం ఊటీలో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగాయి.
కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షుడు మొహ్హమ్మాద్ ఖాదర్ ఘోరి ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలనుండి వచ్చిన అభిమానుల సమక్షంలో హీరో కృష్ణ బర్త్ డే కేకు కట్ చేసారు. అనంతరం కృష్ణ నటించి నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రం 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయక రావు రాసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుస్తకాన్ని కృష్ణ ఆవిష్కరించి తొలి కాపీని విజయనిర్మలకి అందచేసారు, మలి కాపీని కృష్ణ అభిమాని మొహ్హమ్మాద్ ఖాదర్ ఘోరి పదివేల రూపాయలకి కొనుకున్నాడు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాకు చాలాకాలంనుండి తెలుసునని అల్లూరి సీతారామరాజు సినిమా గురించి తాను రాసిని ఈ పుస్తకం ఎంతో ఆశక్తికరంగా వుందని, ఎంతో శ్రమించి ఆయన రాసిన ఈ పుస్తకం ప్రతి అభిమాని దాచుకోదగ్గ పుస్తకం అని, ఈ సందర్భంగా ఇంత మంచి పుస్తకాన్ని నాకు, నా అభిమానులకు అందించిన వినాయకరావు అభినందనీయుడు అని అన్నారు.
ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సినిమా విడుదల అయ్యి అప్పుడే 40 ఏళ్ళు పూర్తి అయ్యాయ అనిపిస్తోందని, ఎంతో ఆశక్తికరంగా ఆ చిత్ర విశేషాలను పుస్తక రూపంలోకి తెచ్చిన వినాయకరావు ని అభినందించారు. అలాగే కృష్ణ గారి సినీ జీవిత చరిత్ర గురించి ఆయన రాస్తున్న మరో పుస్తకం కూడా బాగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు మాట్లాడుతూ, అభిమానులకు నిజమైన నిర్వచనం కృష్ణ గారి అభిమానులని, ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంనుంచి అభిమానులు ఇక్కడికి వచ్చారని, ఈ పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుస్తకం విడుదల కావడం చాలా ఆనందంగా వుందని అన్నారు.




